ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చమర్తి జగన్ రాజు
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా లోని వీరబల్లి మండల విద్యాధికారి కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను, ఎమ్మెల్సీ ఓట్లను పశ్చిమ రాయలసీమ టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని రాజంపేట తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు చమర్తిజగన్మోహన్ రాజు కోరారు.వీరబల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాల వద్ద విరామ సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రధాన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ లెక్చరర్స్ తో కలిశారు.ఈ ప్రముఖ విద్యావేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు గారు, టిడిపి పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డికి మద్దతుగా మొదటి ప్రాధాన్యతను ఓటు వేయమని కోరారు. జగన్ రాజు గారు మాట్లాడుతూ పట్టభద్రులకు వైసీపీ ప్రభుత్వం పై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కొరకు…రాష్ట్ర అభివృద్ధి కోసం…రాష్ట్ర భవిష్యత్ కోసం… రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి గెలిపించాలని ప్రతి పట్టభద్రుల ఓటరు ఇంటింటికి తిరిగి ఎన్నికల నిర్వహించడం జరిగింది.చిన్నపత్తిమ జాతర విందులోమట్లి గ్రామంలో చిన్న గంగమ్మ జాతర సందర్బంగా పత్తి రాజుగారి పల్లికి చెందిన అనంతరాజు ఏర్పాటుచేసిన విందులో చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరబల్లీమండలం టిడిపి అధ్యక్షుడు బాను గోపాల్ రాజు, మట్లి సర్పంచ్ సోమవారపు నాగార్జున చారి, రెడ్డప్ప రెడ్డి ఆంజనేయులు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మట్లిసీనియర్ టిడిపి నాయకులు నాగభూషణం, ఎన్నారై టిడిపి నాయకులు గుది నాగార్జున, మహిళ అధ్యక్షురాలు నాగ సుబ్బమ్మ,నందకుమార్ నాయుడు, చెంగాల లక్ష్మయ్య, జయచంద్ర రెడ్డి , నంద కుమార్ నాయుడు, రాంప్రసాద్ నాయుడు, నేతి రామ్మోహన్, నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు డేరంగుల అనిల్, శశి కుమార్, ఆర్.ఎం.పి బాలకృష్ణ నాయుడు, పరిటాల సుధాకర్, ఎమ్మార్పీఎస్ నరసింహ, శంకవరపు జగదీష్, ఎల్లంపల్లి శ్రీనివాసులు, గిరి, రెడ్డయ్య, కొల్లి నాగ సుబ్బయ్య నాయుడు, భాస్కర్ రాజు, రామకృష్ణంరాజు, సమీర్, చంద్రశేఖర్, దేశం పార్టీ నాయకులు ,అభిమానులు కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.