టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసు.. వెల్దుర్తి ఎంపీపీ అరెస్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చింత శివరామయ్య, చింత ఎలమంద కోటయ్య, సాని రఘురామయ్య, చింతశ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింత ఆదినారాయణను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు చింత శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉన్నారు. టీడీపీ నేత చంద్రయ్యకు చింత శివరామయ్య మధ్య సిమెంట్ రోడ్డు విషయమై గతంలోనే గొడవలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి సాయం తీసుకుని బైక్ పై వస్తున్న చంద్రయ్యను హతమార్చినట్టు పోలీసులు చెప్పారు. అన్ని ఆధారాలతో నిందితుల్ని అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు.