NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నేత నారా లోకేష్ పై రాళ్ల దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త‌త నెల‌కొంది. హత్యచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలవైపు దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయ‌న మండిపడ్డారు. బాధితుల పరామర్శకు వెళ్లిన వారిపై వైసీపీ కుక్కలు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుక్కల దాడులకు టీడీపీ నేతలు బయపడే ప్రసక్తే లేదన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రూ. 5లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. హత్యాచారానికి గురై మృతిచెందిన తిరుపతమ్మ మృతదేహానికి లోకేశ్ నివాళులర్పించారు.

                                   

About Author