టీడీపీ నేత పట్టాభిరాం అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ తిరుగుబాటు!
1 min readపల్లెవెలుగువెబ్, విజయవాడ: రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం మీడియా సమవేశంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ తిరుగుబాటుకు దిగింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపడుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ, తమిళనాడు పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ నేత పట్టాభిరామ్ తప్పుబట్టారు. మాదకద్రవ్యాలపై ఆనందబాబు మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఆయన ఇంటికి రావడంపై పట్టాభిపై మండిపడ్డారు. పోలీసులు నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో పోలీసులు ఈతరహా స్పందిస్తే బాగుంటుదన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం గుంటూరుకు ఆగమేఘాలమీద రావడాన్ని పట్టాభి నిలదీశారు. ఈ క్రమలో పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలై వైసీపీ నాయకులు విజయవాడలోని ఆయన ఇంటిపై దాడి చేసి వస్తుసామాగ్రిని ధ్వంసం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై సైతం వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.