చెప్పులు, చీపుర్లతో కొట్టకుండా ఉండేందుకే భద్రత: వర్ల రామయ్య
1 min read
పల్లెవెలుగు వెబ్: మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. మహిళలు చీపుర్లు, చెప్పులతో కొట్టకుండా కాపాడేందుకే కొడాలికి 1+4 భద్రత కల్పించారని విమర్శించారు. నానికి తెలుగు నేర్పిన గురువు ఎవరూ తెలిస్తే ఆయన కాళ్లకు దండంపెడతానని వర్ల ఎద్దేవా చేశారు. అలిపిరి ఘటన తరువాత చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత కేంద్రం కల్పించిందని.. ప్రజలు నిన్ను కొట్టకుండా ఉండేందుకు జగన్ భద్రత కల్పించారని సెటైర్ వేశారు. ఇలాంటి కొడుకును జన్మనిచ్చినందుకు కొడాలి నాని తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి అయినా కొడాలి నాని మనిషిగా బతకడానికి ప్రయత్నించాలంటూ హితువు పలికారు.