NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నేతలు… చెయ్యేరునదిలో అర్ధనగ్న ప్రదర్శన

1 min read

మాజీ సీఎంను అక్రమ అరెస్టుకు నిరసిస్తూ… మదనగోపాలపురంలో కొవ్వొత్తులతో ర్యాలీ

పల్లె వెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను అక్రమ అరెస్టును నిరసిస్తూ అన్నమయ్య జిల్లాలో రాజంపేట  నియోజకవర్గంలోని   నందలూరు మండలం ఇసుకపల్లి చెయ్యేరు నదిలో టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు రాజంపేట టిడిపి సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ జనసందోహంతో  పెన్నా నదిలో అర్థనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు అనంతరం మదనగోపాలపురం లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై సిఐడి అధికారులు అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపడం చాలా దారుణం అన్నారు తమ నాయకుడు కడిగిన ముత్యంలా తిరిగి బయటకు వస్తారని అన్నారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author