గృహ నిర్బంధంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు
1 min readపల్లెవెలుగువెబ్, గడివేముల: మంగళగిరి టిడిపి రాష్ట్ర కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేసిన నేపథ్యంలో టిడిపి రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. బుధవారం బంద్కు తరలివస్తున్న టీడీపీ నేతలను, ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి టి డి పి ఆఫీస్ వద్దకు రాగా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసిపి నాయకులు ఆదేశాలతో అల్లరిమూకలు టిడిపి కార్యాలయాలపై, నాయకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ భాగస్వాములని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దాడులు చేయడం సరికాదన్నారు.
ఇలాంటి దాడులకు టిడిపి నాయకులు కార్యకర్తలు భయపడరని, దాడులు చేసిన వారందరినీ విచారణ చేసి అరెస్టు చేయాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల సీనియర్ టిడిపి నాయకులు సీతారామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, బంగారు షాపు శ్రీకాంత్, ఒందుట్ల టిడిపి నాయకులు గంగాధర్ రెడ్డి, గఫూర్, కొర్ర పోలూరు టిడిపి నాయకులు జయన్న, బొల్లవరం టీడీపీ నాయకురాలు సుభద్రమ్మ, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.