NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నాయకుల.. దారుణహత్య

1 min read

– జంట హత్యలతో భగ్గుమన్న ఫ్యాక్షన్​
పల్లెవెలుగు వెబ్​, గడివేముల: మండలంలోని పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకుల జంట హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురువారం ఉదయం పెసరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వొడ్డు ప్రతాప రెడ్డి, వొడ్డు నాగేశ్వర రెడ్డి శ్మశాన వాటికకు వెళ్తుండగా వాహనంలో వచ్చిన దుండగులు క్షణాల్లో వేటకొడవళ్లతో వచ్చి దారుణంగా హత్య చేశారు. మూడు రోజుల క్రితం వొడ్డు ప్రతాప్​ రెడ్డి తమ్ముడు వొడ్డు మోహన్​ రెడ్డి చనిపోయాడు. దిన కార్యక్రమాలకు వెళ్తున్న అన్నదమ్ములపై దాడి చేసి హత్య చేశారు. దాడిలో మరో ముగ్గురికి గాయాలైనట్లు వొడ్డు వెంకటేశ్వర రెడ్డి తెలిపాడు. వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


About Author