ఆర్యూ నూతన వీసీ ని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ నూతన వీసీ గా బాధ్యతలు చేపట్టిన బసవరావు ని తెలుగుదేశం పార్టీ ఐటిడిపి జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవిలు ఈరోజు బసవ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థుల కొరకు మరికొన్ని అడ్వాన్స్డ్ టెక్నికల్ కోర్సులను అందజేయాలని విన్నవించారు.రాయలసీమ ప్రాంతానికి తలమానికమైన యూనివర్సిటీని మరింత తీర్చిదిద్దుతూ విద్యార్థుల కోసం కృషి చేస్తానని వీసీ తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.