NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నాయకులకు అసత్య ఆరోపణలు తగదు…

1 min read

– టిడిపి నాయకులు జయసూర్య పై మాజీ సర్పంచ్ వైవి రమణ అనుచరులు ఆగ్రహం.

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు:  టిడిపి నేతకు పాలేరువైతే పాలేరు పనులు  చేసుకోకుండా  మా  నాయకులు మాజీ సర్పంచి వైవీ రమణ పై  విమర్శలు చేస్తే సహించేది లేదని వైవీ రమణ అనుచరులు టీడీపీ నాయకులు జయసూర్యను హెచ్చరించారు.  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి  నేను మా నాయకునికి పాలేరునని  చెప్పుకుంటున్నావు. ఇలాంటి మాటలతో  ప్రజల ముందు ఏమి మొఖం పెట్టుకొని వస్తావు.. ఇంటి వద్దనే పాలేరు పనులు  చేసుకో అంతే గాని ఉత్తముడైనా మాజీ సర్పంచ్ వైవి రమణ పై అసత్య ఆరోపణలు  చేయిస్తే  సహించం అంటూ రమణ అనుచరులు రాజేష్, సురేష్,శివన్న హెచ్చరించారు. టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ వైవి రమణ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ శనివారం ఆయన  అనుచరులు పుట్టల  రాజేష్, ఎల్లల చిన్న పక్కిరయ్య,వడ్డే శివప్రసాద్. మహానంది సురేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ వైవి రమణ తన సర్పంచ్ పదవి కాలంలో గ్రామ అభివృద్ధి కోసం,  దళిత ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ఉత్తముడు అన్నారు. వైవి రమణ పై టిడిపి నాయకులు చేసిన కబ్జా ఆరోపణలు నా పేరు వాడి  నా పొలమును కబ్జా చేశారని చెప్పడం సరికాదని అందులో నిజం కాదని  ఆ భూమి నాకే వచ్చేలా సహాయం చేసిన  మా నాయకుడు ఉత్తముడని మహానందిగారి సురేష్ స్పష్టం చేశారు. మీరు చేసినా కబ్జా ఆరోపణలో అవాస్తవాలు అని తెలిసినా కూడా ఆయనపై ఆరోపణలు చేయడం తగదన్నారు.  మాజీ ఎమ్మెల్యే లబ్బి ఒక దళితుడని, ఆయన అనుచరుడు వైవి రమణ దళితుడన్న విషయాన్ని విస్మరించి  ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసిన దళిత నాయకులను దళితులై ఉండి విమర్శలు చేయడం తగదన్నారు. మీ స్థాయి గ్రహించి ఆరోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. నీ రాజకీయ అభివృద్ధికి ఎవరు అడ్డురారని స్థాయి మరచి విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లబ్బి అభిమానులు ,  కాటేపోగు నాగ సురేష్, పగడం సుధాకర్, భాస్కాపురం సంజన,మాజీ సర్పంచ్ వైవి రమణ అనుచరులు  పాల్గొన్నారు.

About Author