NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి నాయకులు కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

1 min read

మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి 

పల్లెవెలుగు వెబ్ గడివేముల: పాణ్యం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో  టిడిపి జనసేన ఉమ్మడి నాయకుల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశo నిర్వహించారు  .ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసిపి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని టిడిపి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వం మళ్లీ గద్దినక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఉందని తెలిపారు పాణ్యం లో విజయం ఈసారి తమదేమని అందరూ కలిస్తేనే విజయం సాధ్యమవుతుందని ఈసారి ప్రజలు టిడిపి  వైపే ఉన్నారని రానున్నది టిడిపి ప్రభుత్వమేనని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గౌరు వెంకట రెడ్డి .  మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి,పాణ్యం ఎంపిటిసి రంగ రమేష్, మండల నాయకులు కౌలూరు భాస్కర్ రెడ్డి,రమణ మూర్తి,లాయర్ బాబు,జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జగదీష్,గోవింద్ రెడ్డి,మరియు పాణ్యo మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author