చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జలదీక్ష చేపట్టిన టిడిపి నేతలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా బుధవారం నగరంలోని సంకల్ బాగ్ లోని దుర్గా ఘాట్ వద్ద జల దీక్ష చేపట్టారు. నేతలందరూ నీటిలోకి దిగి చంద్రబాబుకు మద్దతుగా ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారన్నారు. ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఆయన క్లీన్ చిట్ తో కేసుల నుండి బయటపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు గున్నామార్క్, సుంకన్న, రామాంజనేయులు, తిమ్మోజీ, తిరుపాల్ బాబు, ఏసు, రాజశేఖర్ రెడ్డి, పాల్ రాజ్, చిన్నమ్మ, సుశీలమ్మ, టి.ఎన్.ఎస్.ఎఫ్, ఐటిడిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.