ఆక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: చంద్రబాబు అరెస్టు అక్రమం ముక్తకంఠంతో ఖండించిన పార్టీలు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఆదివారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు కి సంఘీభావంగా నిరసన దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షలో పాల్గొన్న టిడిపి నేతలకు మద్దతు తెలిపారు. టిడిపి నేతలు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కేఈ ప్రభాకర్ శ్యాం కుమార్ తదితరులు దీక్షా శిబిరంలో పాల్గొని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబును ఏదో విధంగా ఇబ్బందికి గురి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు నిప్పులాంటి వాడని ఎలాంటి తప్పులు చేయడని వారు స్పష్టం చేశారు. సిపిఐ నాయకులు రాజా సాహెబ్ దీక్ష శిబిరానికి చేరుకొని వారికి మద్దతుగా నిలిచారు. ఈ నిరసన దీక్షలలో నియోజకవర్గంలోని ఐదు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక టిడిపి నేతలు కే సాంబశివరెడ్డి రామనాయుడు అశోక్ కుమార్ తిరుపాలు తిమ్మయ్య చౌదరి సింగం శ్రీనివాసులు గోవిందు గౌడ్ బి.టి గోవిందు సురేంద్ర రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.