NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే..!

1 min read
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర‌రావు

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర‌రావు

హైద‌రాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర‌రావు టీఆర్ఎస్ లో చేరారు. ఈయ‌న ఖ‌మ్మం జిల్లా అశ్వారావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గెలిచారు. మెచ్చా నాగేశ్వర‌రావు టీఆర్ఎస్ లో చేర‌డంతో.. టీడీపీ కి తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం పోయింది. ఇప్పటికే స‌త్తుప‌ల్లి నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట వీర‌య్య టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణ టీడీపీ ఎల్పీని …టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్యేలు ఇరువురు ప్రక‌టించారు. ఈ మేరకు శాస‌న‌స‌భ వ్యవ‌హారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని క‌లిశారు. తెలంగాణ శాస‌నస‌భ‌లో టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్ లో చేర‌డంతో.. తెలంగాణ‌లో టీడీపీ శ‌కం ముగిసిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About Author