PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. రెండుమూడు రోజుల్లో టీడీపీ స‌భ్యత్వానికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి బుచ్చయ్య చౌద‌రి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ తీరుపై తీవ్ర అసంతృప్తికి లోనైన‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్లను టీడీపీ అవ‌మానిస్తోందని బుచ్చయ్య చౌద‌రి ఆవేద‌న‌కు లోనైన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌద‌రి కొన‌సాగుతున్నారు. 2019లో జ‌గ‌న్ గాలిని త‌ట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేల్లో బుచ్చయ్య చౌద‌రి ఒక‌రు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బుచ్చయ్య చౌద‌రి పార్టీలో కొనసాగుతున్నారు. 1995 టీడీపీ సంక్షోభంలో బుచ్చయ్య చౌద‌రి ఎన్టీఆర్ వెంటే న‌డిచారు. అలాంటి సీనియ‌ర్ నేత పార్టీ ప‌ట్ల అసంతృప్తిని వ్యక్తం చేయ‌డం పార్టీలో క‌ల‌క‌లంరేగింది.

About Author