NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ నేతలు సస్పెండ్‌ అయ్యారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ మేరకు సభనుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణపై చర్చ జరుగుతుందని దీన్ని అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడంలేదని బుగ్గన పేర్కొంటూ టీడీపీ సభ్యులు అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సప్పెండ్ చేయాల్సిందిగా బుగ్గను సభాపతికి సూచించారు. దీంతో తమ్మినేని సీతారాం ఒక రోజు సభ నుంచి టీడీపీ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

                                                  

About Author