NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్

1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఆయన నివాసం నుంచి రాత్రి 11 గంటల సమయంలో తరలించారు. ఓ ఫంక్షన్ కు వెళ్లి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న అశోక్ బాబును.. అప్పటికే మఫ్టీలో ఉన్న సీఐడీ అధికారులు అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్ బాబును అరెస్టు చేసినట్టు, కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి నోటీసు అందించారు. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా.. చదివినట్టు తప్పుడు ధృవపత్రం సమర్పించారని, మరికొన్ని ఆరోపణలతో మెహర్ కుమార్ అనే వ్యక్తి గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అశోక్ బాబును అరెస్టు చేశారు.

         

About Author