PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి అరాచక పాలన అంతం కావాలి.. టిడిపి అధికారంలో రావాలి..

1 min read

గౌరు దంపతులు

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  వైకాపా అరాచకమే టిడిపికి బలమని గౌరుదంపతులు అన్నారు. మండల కేంద్రమైన గడివేముల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బుధవారం నాడు మండలంలోని అన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గౌరు వెంకట్ రెడ్డి, పాణ్యం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికునిగా పనిచేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఓటర్ లిస్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామంలో లేనివారు ఓట్లను దొంగల ఓట్లను తొలగించుకోవాలని అన్నారు. ఎవరైనా గ్రామంలో ఓటు లేకపోతే ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన చేశారని ఆపాలనకు అంతం చేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు 55 రోజులు సమయం ఉందని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, శంకరావం అను కార్యక్రమాలకు డోర్ టు డోర్ ప్రచారానికి బిజెపి, జనసేన పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేసి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి  తెలుగుదేశం పార్టీకి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గౌరు దంపతులు కోరారు. వైసిపి నాయకులు అరాచకం పై ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఓటు వేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు అన్ని రకాలుగా రిజర్వేషన్లను  ఏర్పాటు చేస్తుందని గౌరు చరిత రెడ్డి తెలిపారు. ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు అధైర్య పడవద్దని ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని పధకాలు ఇచ్చారు అన్నిటికీ మించి మంచి పథకాలు అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో జగన్ సైకో పరిపాలన చేశాడని గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎక్కడ చూసినాతెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి కనబడుతుంది అన్నారు. కేవలం మూడు కోట్లతో అలగనూరు రిజర్వాయర్ కట్ట పనులను చేయకపోవడం చాలా దారుణం అన్నారు. వైసీపీ పార్టీ నిర్లక్ష్యం వల్లనే నేడు అలగనూరు రిజర్వాయర్ కట్ట పనులు 30 కోట్ల చేరిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలుగునూర్ రిజర్వాయర్ పనులను మరియు వెలగమాన్ డ్యామ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులు ఎన్నికల కోసం బాగా కష్టపడాలని పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు దేశం సత్యనారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, కృష్ణ యాదవ్, శ్రీనివాస యాదవ్, ఎస్సీ రఫీక్, ఫారుక్, రాచమల్లు శ్రీనివాసులు, కంది శ్రీనివాసులు, దిలీప్ కుమార్ రెడ్డి, గణేష్ రెడ్డి, వంగాల మురళీమోహన్ రెడ్డి, హర్షవర్ధన్, సుభద్రమ్మ, లక్ష్మీదేవి, పార్వతమ్మ, జయప్రకాష్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author