NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాదయాత్రకు సంఘీబావం తెలిపిన టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనారాలోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం పాదయాత్రకు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి సీ రామచంద్ర సంఘీబావం తెలిపారు. అన్నమయ్య జిల్లా లో కొన సాగుతున్న లోకేష్ బాబు పాదయాత్రకు చేనేత కార్మికులు,అభిమానులు తో కలిసి చేనేత కార్మికుల. సమస్యలు వివరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చేనేత కార్మికునికి గుర్తింపు కార్డు మంజూరుచేయాలన్నారు. తద్వారా 50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికునికి పెన్షన్ ఇవ్వాలని నారా లోకేష్ గారిని కోరారు. నారా లోకేష్ బాబు గారు సానుకూలంగా స్పందించి టీ డీ పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు అండగా ఉంటామన్నారు.అదేవిధంగా చేనేత కార్మికుల రుణాలు మాఫీచేస్తామన్నారు. టీ డీ పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికునికి పెన్షన్ ఇచ్చామన్నారు.జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారన్నారు.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి రాబోవు ఎన్నికలలో చంద్ర బాబు నాయుడు సీఎం గా గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు.రాష్ట్రం కుదుట పడాలన్న అభివృద్ధి చెందాలన్న,బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలంటే చంద్ర బాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.,ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

About Author