PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఉపాధ్యాయురాలిని ఘనంగా సన్మానించిన టిడిపి పార్టీ         

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా,  పత్తికొండ మండలం, దూదేకొండ గ్రామపంచాయతీ, మజారా, మారుమూల గిరిజన గ్రామమైన JM తాండ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయిని కళ్యాణి మేడo ను స్థానిక టిడిపి నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు. కళ్యాణి టీచర్ అంకితభావంతో ఉపాధ్యాయ వృత్తికి తనదైన శైలిలో న్యాయం చేస్తూ, విద్యార్థులకు తగిన రీతిలో విద్యాబుద్ధులు నేర్పుతూ వారి తలరాతలను మార్చే దిశగా అడుగులేసింది. ఉపాధ్యాయురాలుగా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కళ్యాణి మేడం పాఠశాలలో చేరిన తర్వాత కొన్నాళ్లకు 55 మంది విద్యార్థులతో పాఠశాల కళకళలాడుతుంది. దీని వెనుక కళ్యాణి మేడం అకుంఠిత దీక్ష, సేవా తత్పరత దాగి ఉంది. కళ్యాణి మేడం ఆ పాఠశాలకు అందించిన సేవలకు గాను ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. అందులో భాగంగానే గత సంవత్సరం కళ్యాణి మేడం రాష్ట్రంలో ఉపాధ్యాయుని పురస్కారం అందుకున్నారు. అలాగే జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్నారు. ఈ సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కళ్యాణి మేడం పలు పౌర సన్మానాలను అందుకుంది. కళ్యాణి టీచర్ సేవలను గుర్తించిన స్థానిక తెలుగుదేశం పార్టీ యావత్తు నేతలు జయం తాండ గ్రామానికి వెళ్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కళ్యాణి మేడం న  ఘనంగా సన్మానించారు. కళ్యాణి మేడంకు శాలువాలు కప్పి పూలమాలలతో మెమొటోలు అందజేసి, సత్కరించారు. పాఠశాలకు ఆమె చేసిన సేవలను నేతలందరూ కొనియాడారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ కళ్యాణి టీచర్ కు వక్తలు కితాబిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు సాంబశివరెడ్డి, బత్తిని వెంకటరాముడు మాట్లాడుతూ, సమాజం సరైన మార్గంలో నడవాలన్నా, సమాజాన్ని సుసంపన్నo చేయాలన్నా మీలాంటి గురువుల వల్లనే సాధ్యపడుతుందని వారన్నారు. విద్యతోనే సర్వం సాధ్యమవుతాయని, అందుకు కళ్యాణి టీచర్ లాంటి ఉత్తమ టీచర్ అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు, ప్రమోద్ కుమార్ రెడ్డి,అశోక్ కుమార్, తిరుపాలు, సోమ్లానాయక్, రవీంద్రనాథ్ చౌదరి,గుడిసె నరసింహులు, పెద్దహల్తి తిప్పన్న,గోపాలకృష్ణ, శ్రీనివాసులు గౌడ్, శివరాముడు,హల్తెన్న, రంగన్న ,భిమ్లా నాయక్,సురేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

పురస్కారం, టీచర్​, సేవలు, టిడిపి, అవార్డులు,

About Author