వాల్మీకులకు రాజకీయ గుర్తింపు ఇచ్చింది టిడిపి పార్టీనే
1 min readరాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: రాజకీయంగా గుర్తింపు లేని వాల్మీకి బోయలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చిందని రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు అన్నారు. పాణ్యం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారకరామారావు టిడిపిని స్థాపించి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొని రావడంతో రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయలు స్థానిక సంస్థల్లో పోటీ చేసి సర్పంచులుగా,మండల అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా,మరియు మునిసిపల్ చైర్మన్లుగా గెలుపొంది చట్టసభలో రాజ్యాంగ హక్కుపొందారున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు మంత్రివర్గంలో వాల్మీకి బోయ కాలువ శ్రీనివాసులు కు క్యాబినెట్ మంత్రిగా అవకాశం కల్పించిందన్నారు. శాసన మండలి లో ఎమ్మెల్సీగా బిటి నాయుడు కు అవకాశం కల్పించారన్నారు. వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయుటకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది అన్నారు వాల్మీకి బోయ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకులకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత 62 సంవత్సరాలుగా వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించమని చేసిన రాష్ట్ర వాల్మీకి సంఘాల పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం 2018 డిసెంబర్లో వాల్మీకి బోయ లను ఎస్టీలుగా గుర్తించమని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగిందన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాల్మీకి బోయలకు పెద్ద పీట వేశారన్నారు రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో వాల్మీకి బోయలకు ఒక ఎంపీ 4 ఎమ్మెల్యేల సీట్లు కేటాయించడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకి బోయలలో రాజకీయ చేతన్యమును తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ ద్వారానే వాల్మీకి బోయలకు పూర్తి న్యాయం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి బోయ సాధికార సమితి సభ్యులు గుజ్జుల సుబ్బయ్య వాల్మీకి బోయ సాధికార సమితి సభ్యులు శేఖర్ నాయుడు టైలర్ శేషు రమేష్ ప్రసాద్ రాము బిసి మదిలేటి కిట్టు ఎల్ల నాయుడు వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.