NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ అధ్యక్షుడు.. టీఆర్ఎస్ పార్టీలోకి…!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలుగు దేశం పార్టీకి తెలంగాణ‌లో మ‌రో షాక్ త‌గ‌ల‌నుందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. ర‌మ‌ణ గులాబి గూటికి చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే ఎల్. ర‌మ‌ణ‌తో టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడినట్టు.. ర‌మ‌ణ టీఆర్ఎస్ లో చేర‌డానికి సానుకూలంగా ఉన్నట్లు స‌మాచారం. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ కూడ ఎల్. ర‌మ‌ణ‌తో మాట్లాడార‌ని స‌మాచారం. ఎల్.ర‌మ‌ణ‌కు బీసీల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. ప‌ద్మశాలి వ‌ర్గానికి చెందిన ఎల్.ర‌మ‌ణ‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వార ఈటెల లేని లోటు పూడ్చవచ్చని గులాబి బాస్ కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ట‌. త్వర‌లో కేసీఆర్ తో ఎల్. ర‌మ‌ణ భేటీ అవుతార‌ని స‌మాచారం.

About Author