NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా టిడిపి అధ్యక్షులు సోమిసెట్టి వెంకటెశ్వర్లు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిసెట్టి వెంకటెశ్వర్లు జన్మదిన వేడుకలను ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు తెలుగుదేశంపార్టీ రాష్త్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, కార్యలయ కార్యదర్శి కొరకంచి రవికుమార్ గార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పార్టీ కార్యాలయమునకు చేరుకొని సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సంధర్బంగా నంద్యాల నాగేంద్ర మాట్లాడుతూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందిస్తున్నారని, ఒకే జెండా ఒకే పార్టీ సిద్ధాంతంతో పని చేయుచున్నారని, రానున్న 2024 ఎన్నికల్లొ సోమిశెట్టి వెంకటెశ్వర్లు గారి సారధ్యంలొ కర్నూలు పార్లమెంట్ పరిధిలొ అన్ని నియోజకవర్గములలొ తెలుగుదేశంపార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.

About Author