NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసిపి వ్యాఖ్యలకు నిరసనగా.. టిడిపి ర్యాలీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: శాసనసభలో వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా పత్తికొండలో శనివారం టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేసింది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి టిడిపి కార్యకర్తలు నాయకులు వైసీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేస్తూ నాలుగు స్తంభాల కూడలి వరకు చేరుకున్నారు. అదేసమయంలో స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఒక దినపత్రిక ఆవిష్కరణకు అక్కడికి చేరుకుంది దీంతో టిడిపి శ్రేణులకు ఎమ్మెల్యే రాకతో తీవ్ర స్వరంతో ముందుకు దూసుకు వచ్చారు. పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అని పోలీసులు టిడిపి శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు టిడిపి శ్రేణులను పోలీసులు అటకాయించి ఎమ్మెల్యే కాన్వాయ్ కి రక్షణగా నిలిచారు. అనంతరం టిడిపి శ్రేణులు నాలుగు స్తంభాల కూడలి వద్ద గద్గద స్వరంతో నిరసన నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన వెంకట రాముడు బీసీ సెల్ టిడిపి జిల్లా నాయకులు రామానాయుడు అశోక్ కుమార్ వైసీపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్థాయి లేని వైసిపి నాయకులు తమ నాయకుడు చంద్రబాబుపై ఆయన సతీమణి భువనేశ్వరిపై తీవ్ర పదజాలం వినియోగించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. వైసీపీ అధికార మదంతో ప్రతిపక్ష పార్టీపై చేస్తున్న దౌర్జన్యాలు అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైసిపి చేసే కుట్రలు కుతంత్రాలు దాడులు దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.  

About Author