NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27వరోజు కొనసాగిన టిడిపి రిలే నిరాహారదీక్షలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్  కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి చేపట్టిన నిరసన రిలే నిరాహారదీక్షలు  27 వ రోజుకు చేరుకున్నాయి. సైకో జగన్  కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ బాబు గారికి తోడుగా ఒక్క నియంత పై  పోరాటం కోసం మేము సైతం అంటూ స్థానిక నాలుగు స్తంబాల కూడలిలో  27 వ రోజున నలక దొడ్డి గ్రామ టిడిపి నాయకులు  రీలే నిరాహారదీక్ష చేపట్టారు.రిలే నిరాహారదీక్షలలో కూర్చున్న నిరసన కారులకు  సంఘీభావం తెలుపుతూ,నలకదొడ్డి అరగుండు  వేయించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈరీలే నిరాహార దీక్షకు సిపిఐ,జనసేన పార్టీ లు సంఘీభావం ప్రకటించారు.కార్యక్రమంలో టిడిపి నాయకులు కే.సాంబశివ రెడ్డి, బత్తిన వెంకట్రా ముడు,రామా నాయుడు,అశోక్ కుమార్,బత్తిన లోక్ నాథ్, తిప్పన్న,హోసూరు శ్రీనివాసులు, తిరుపాల్,సింగం శ్రీనివాసులు,శ్రీనివాసులు గౌడ్,గోవిందు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author