24వ రోజు కొనసాగిన టిడిపి రిలే నిరాహార దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ ను నిరసిస్తూ టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. పత్తికొండ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కె సాంబశివారెడ్డి మాట్లాడుతూ, సైకో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. బాబు గారికి తోడుగా… ఒక్క నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ స్థానిక నాలుగుస్తంబాల కూడలిలో లింగనేనిదొడ్డి గ్రామస్థులు విన్నూతంగా ఉరి కాళ్ళను గొంతులకు తగిలించుకొని నిరసన తెలిపారు. అనంతరం రిలే నిరాహార దీక్షలో 24 వరోజు తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి గ్రామస్థులు రీలే నిరాహారదీక్ష శిబిరం వద్ద దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం తెలుపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపిఇంచార్జి KE శ్యామ్ కుమార్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రామానాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు తిరుపాలు, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు ఎం అశోక్ కుమార్, హోసూరు, పెద్దహుల్తి, నలగదొడ్డి గ్రామాల మాజీ సర్పంచులు శ్రీనివాసులు, తిప్పన్న, బత్తిని లోకనాథ్, స్థానిక టిడిపి నాయకులు శ్రీనివాసులు గౌడ్, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్ బిటి. గోవిందు, గోవిందు గౌడ్, సురేంద్ర, సంజప్ప, ఉచ్చూరప్ప తోపాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సీపీఐ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన నాయకులు పాల్గొని రిలే నిరాహార దీక్షలకు మద్దతు ప్రకటించారు.