మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన టిడిపి
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: వైసిపి పత్తికొండ శ్రీదేవి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పత్తికొండ టిడిపిపై చేసిన వ్యాఖ్యలకు స్థానిక టిడిపి నాయకులు ఘాటుగా స్పందించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాలివాహన చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి మాజీ ఎమ్మెల్యే కంగ్రాట్స్ శ్రీదేవి టిడిపి పై చేసిన విమర్శలను తిప్పి కొట్టారు.ఈ సందర్భంగా మాజీ శాలివాహన చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ…. మీరు OTS వన్ టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే అని అన్నారు. ఏదో మీ అదృష్టం బాగుండి ఒక్కసారి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకలిగారని ఎద్దేవా చేశారు. మీ నాయకులు వందల ఎకరాలను ఎండోమెంట్ మరియు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారనీ, అవన్నీ మేము బయటకి తీస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో మీ అనుచరులు మరియు నాయకుల చిట్టాను బయటికి తీసుకొస్తామని అన్నారు. అలాగే మా ఊరు తుగ్గలి చెరువు కు గతంలో ఫండ్స్ వచ్చాయి. మీరు పనులు చేయకముందు చెరువును ఎలా ఉన్నది వీడియో తీసి పెట్టాం, అలాగే మీరు పనులు చేసిన తర్వాత కూడా వీడియోలు తీసి పెట్టాం. మరి చెరువుల పనులలో అవినీతి జరిగిందా లేదా అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు.అసెంబ్లీలో మా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ప్రసంగిస్తూ, గత వైసిపి లో ప్రభుత్వ ధనం అన్యాయమైపోయింది, అని మాట్లాడడం తప్పుకాదు కదా అని ప్రశ్నించారు.టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కి గ్రాంట్ రిలీజ్ అయి ఉంటే మరి జ్యూస్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు మీరు చేయలేకపోయారు అని మాజీ ఎమ్మెల్యే ను సూటిగా అడిగారు.