NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ సేవలు భేష్​..: గోపులాపురం వాసులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కమలాపురం: మూడు రోజులుగా నీటిసరఫరా నిలచిపోయి నీటి కోసం అష్టకష్టాలు పడుతు నీటి సహాయం  ఎవరు చేస్తారని ఎదురు చూస్తున్న  ప్రజలకు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ  నీటి సమస్యను పరిష్కరించి నీటి కష్టాలు తీర్చాడు . కమలాపురం మండలం గోపులాపురం  గ్రామంలో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది  పైపు లైన్లు విద్యుత్ మోటార్ల వైర్లు పాడవడంతో మోటార్లు పని చేయక  గత రెండురోజులుగా గ్రామ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు  విద్యుత్ మోటార్లను తయారు చేసే నాధుడే   కరువవ్వడం తో నీటి సమస్య ఎప్పుడు  పరిష్కారమవుతుందో గ్రామస్థులకు తెలియని పరిస్థితి ఏర్పడింది గ్రామంలో నీటి సమస్య తీవ్రత మీడియాలో రావడంతో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ తక్షణమే స్పందించి గ్రామంలోని విషయాన్ని  స్థానికుల ద్వారా కనుక్కొని రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి సహకారంతో గ్రామానికి ట్రాక్టర్ టాంకుల ద్వారా నీటి సరఫరా చేసాడు అలాగే త్రాగునీటి కోసం మంచినీటి మినరల్ వాటర్ ట్యాంకర్లను ప్రత్యేకంగా పంపించి త్రాగునీటి కష్టాలు తీర్చాడు నీటి కోసం పశువులు గేదెలు మేకలు ఇతర జంతువులు సైతం తీవ్రంగా అలమటిస్తుండ డంతో టాంకర్ల ద్వారా నీరు గ్రామానికి రావడంతో వాటికి సైతం దాహం తీరి ఉపశమనం కలిగింది ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ తమ గ్రామ సమస్యను పట్టించుకోని పరిస్థితుల్లో సాయినాథ్ శర్మ చొరవ తీసుకొని నీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్థులు ముఖ్యంగా మహిళలు సాయినాథ్ శర్మ సేనలను ప్రశంసిస్తున్నారు.

About Author