PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బందార్ల పల్లె గ్రామంలో టిడిపి షాక్

1 min read

– బందార్ల పల్లె గ్రామంలోని 22 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలోకి చేరిక
– అలాగే రంజాన్,బక్రీద్ పండుగల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి ఈద్గా ను ఏర్పాటు చేస్తా
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కొలిమిగుండ్ల మండలం బందర్ల పల్లె గ్రామంలో నీ 22 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టిడిపి పార్టీని వీడి బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ పార్టీలో చేరారు. బందార్ల పల్లె గ్రామం టిడిపి పార్టీ కు చెందిన హుస్సేన్ పీరా, గౌస్ మోదిన్, మహమ్మద్, హుస్సేన్ బాషా, హాజీవలి, డిష్ వలి,హుస్సేన్ వలి, షేక్షావలి, నంద్యాల భాష ,బుడెన్ సా, మస్తాన్ వలీ, హుస్సేన్ సా,రెడ్డిపల్లి భాష, కాశీం, జాకీర్,గొరుమాను పల్లె మహమ్మద్, వలి, నబి రసూల్, మహమ్మద్ సా, బాషు,ఆటో నూర్ భాషా, రజాక్ లను వైయస్సార్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బందార్ల పల్లె గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు యాతం వెంకట శివరామిరెడ్డి, యాతం వీరగోపాల్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, మక్కల వెంకటరాముడు, ఉయ్యాల మనోహర్ రెడ్డి, పెద్దకృష్ణ,మల్లికార్జున, రాజా డేరంగుల తదితరులు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు బందార్ల పల్లె గ్రామానికి చెందిన 22 కుటుంబాలు ముస్లిం మైనార్టీలు టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలోకి చేరడం జరిగిందని వారందరికీ కూడా వైయస్సార్ పార్టీలో సబచితస్థానాన్ని కల్పిస్తానని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు గారు తెలిపారు. గ్రామంలో ముస్లిం మైనారిటీలకు స్మశానానికి సంబంధించి స్థల సేకరణ చేయడం జరిగిందని అలాగే ముస్లిం మైనార్టీలకు రంజాన్, బక్రీద్ ముఖ్య పండుగలో ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి ఈద్గా కావాలని కోరడం జరిగింది అని వాటిని కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు హామీ ఇచ్చారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్షాన్ని అందులో భాగంగానే ప్రతి గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి చెందాలన్నా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నా మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అలాగే బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని తనకు ఈ గ్రామంలోని వైయస్సార్ పార్టీ నాయకులు అందరూ సమిష్టి కృషితో అత్యధిక మెజార్టీని తీసుకురావాలని చెప్పారు. ఈరోజు టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలో చేరిన వారందరికీ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

About Author