PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలు బాగుండాలంటే టిడిపి గెలవాలి.. టిడిపి ఇంచార్జి టి.జి భరత్

1 min read

– కర్నూలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న టి.జి భరత్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు

– రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేసిన టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రజలు బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో జరిగిన కర్నూలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడాలని సూచించారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే రాష్ట్రం  అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. ఒక్క పరిశ్రమ వచ్చినా ప్రజల జీవితాలు మారుతాయన్నారు. ఉద్యోగ, ఉపాది అవకాశాలు రావడంతో పాటు ప్రజల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పార్టీ శ్రేణులకు వివరించారు. అనంతరం సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నప్పటికీ ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ఆయన కుటుంబ సభ్యులు బయటకు వచ్చారన్నారు. కర్నూల్లో టిజి భరత్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు పోతురాజు రవి కుమార్, అబ్బాస్, జహంగీర్ బాషా, జేమ్స్, నాగయ్య, పరమేశ్వర్ రెడ్డి, తిమ్మోజీ, పామన్న, తిరుపాల్ బాబు, నాగేంద్ర, సోమిశెట్టి నవీన్, కార్పోరేటర్ పరమేశ్, గున్నామార్క్, సంజీవలక్ష్మి, చిన్నమ్మ, ఏసు, మాజీ కార్పోరేటర్లు, మహిళా నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author