NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలి…

1 min read

టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టిడిపి కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. మంగళవారం నగరంలోని 43 వ వార్డులోని ఇందిరాగాంధీ నగర్లో నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేతలు, కార్యకర్తలు వార్డులోని ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మహిళలు, యువతకు టిడిపి గెలిస్తే జరిగే మేలు ఏంటో అర్థమయ్యేలా చెప్పారు. కర్నూల్లో టి.జి భరత్ ఎమ్మెల్యే అయితే వార్డువార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని హమీ ఇచ్చారు. అనంతరం నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ఒక్కసారి టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరామన్నారు. మహిళల స్వయం ఉపాధికి ఆయన క్రుషి చేస్తారని చెప్పారు. టి.జి భరత్ గెలిస్తే స్థానికంగా పరిశ్రమలు వచ్చి యువతకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజశేఖర్ రెడ్డి, ఏసన్న, రవి, నాగేశ్వరరావు, అశోక్, వెంకటేష్, రాము, వెంకటేశ్వర్లు, అంజి, భాస్కర్, సాంబ, కార్తీక్, ఈశ్వరయ్య, మహిళా నాయకురాళ్లు భాగ్యమ్మ, సువేద, లలితమ్మ, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author