NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీఆర్ఎస్ లోకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ ఆఫ‌ర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అండ‌దండ‌గా ఉన్న ఎల్. ర‌మ‌ణ టీఆర్ఎస్ లో చేరిక‌కు రంగం సిద్దమైంది. ఈ మేర‌కు ఇవాళ మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ తో ఎల్. ర‌మ‌ణ భేటీ కానున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప‌లువురు నేత‌ల‌తో చ‌ర్చించిన ఎల్. ర‌మ‌ణ టీఆర్ఎస్ లో చేరాల‌నే నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి ద‌యాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ తో క‌లిసి సీఎం కేసీఆర్ ను క‌ల‌వ‌నున్నారు. త్వర‌లో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గ‌వ‌ర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్. ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ గా అవ‌కాశం ఇస్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఎమ్మెల్సీ ఆఫ‌ర్ తో ఎల్. ర‌మ‌ణ టీ.టీడీపీని వీడి.. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన‌ట్టు తెలుస్తోంది.

About Author