పల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరం కానున్నట్లు సమాచారం. మేకపాటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో సంప్రదాయాన్ని పాటించాలని టీడీపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.