PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చెయటమే టీడీపీ లక్ష్యం

1 min read

– టీడీపీ నేత చమర్తి జగన్ రాజు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: గ్రామ స్థాయిలోని అన్ని వర్గాల నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రముఖ విద్యావేత్త,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చమర్తి జగన్ రాజుపేర్కొన్నారు . అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోనిసుండుపల్లి మండల పరిధిలోని జి.రెడ్డివారి పల్లి, సొంటంవారిపల్లి, గుండ్లపల్లి, గుండ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలిపారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు,యువత గ్రామంలోని పొలిమేర నుంచి డప్పు వాయిద్యాలతో భారీగా బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు.చంద్రబాబు లోకేష్ జగన్ రాజులకు జే.జే.లు కొడుతూ, కేరింతలు కొడుతూ నీరాజనాలు పడుతూ స్వాగతించారు.మహిళలు వీధివీధిన హారతులు పడుతూ ఆశీస్సులు అందించారు.ప్రతిచోట పూల వర్షం కురిపించారు.రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మూడు గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి, గ్రామ స్థాయి నుంచే పార్టీని అన్ని విధాల బలోపేతం చేసేందుకు సీనియర్ నాయకత్వం తో పాటు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అన్ని విధాల తోడ్పాటునందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.గతంలో జరిగిన పొరపాటులను అధిగమించి ప్రస్తుతం కార్యకర్తలే పార్టీ పునాదిగా పనిచేస్తామని, నాయకులందరి సహాయ సహకారాల తో సుండుపల్లె మండలంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఉద్ఘాటించారు.మహిళలు,యువత గ్రామస్తుల ఆధ్వర్యంలో రాష్ట్ర రథసారథి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామస్తులు జగన్ రాజు గారిని ఘనంగా దుశ్యాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట గురుస్వామి నాయుడు, రాజగోపాల్ నాయుడు,రాజా నాయుడు, వేములయ్య,ప్రతాప్ రెడ్డి,బాలాజీ నాయక్,గ్రామ అధ్యక్షులు శేఖర్ నాయుడు, మాజీ సర్పంచ్ మణికంఠ,మాజీ ఎంపీటీసీ బాలాజీ నాయక్, ఆంజనేయులు నాయుడు, శివకుమార్ నాయుడు,ప్రతాప్ నాయుడు,బీసీ నాయకులు విశ్వనాథ్,చంద్ర,మైనార్టీ నాయకులు ఖలీల్, మహబూబ్ బాషా, షఫీక్,మాజీ ఎంపీటీసీ ఆంజయ్య,సురేష్ నాయుడు, శివరాం నాయుడు, నంద్యాల శివప్రసాద్,చంద్రశేఖర్ రాజు,చిన్నరెడ్డయ్య, చంద్రమౌళి,LV రమణ, అమరనాథ్ రెడ్డి,భారీ ఎత్తున మహిళలు,యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author