PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీపై.. బురద చల్లడమే టీడీపీ లక్ష్యం..

1 min read

– మాజీ ఎంపీపీ ముదిరెడ్డి శివరామిరెడ్డి, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ జి ఎన్

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు  కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మండల అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకుపోవడం జరుగుతుందని మాజీ ఎంపీపీ ముది రెడ్డి శివరామిరెడ్డి, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి లు అన్నారు, గురువారం సాయంత్రం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,, మండల అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు తీసుకువచ్చి మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరుగుతుందన్నారు, అందులో భాగంగా గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ ప్రజలు డ్రైనేజీ సమస్యను, అలాగే రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు, ఆయన వెంటనే స్పందించి కొత్త రోడ్డు మీద నుండి రామాలయం వరకు, రోడ్డు అదేవిధంగా, కొత్త రోడ్డు మీద నుండి వనం వీధి వరకు డ్రైనేజీ కొరకు కోటి రూపాయలు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు, అయితే ఒకపక్క త్రాగునీటి పైపులైను, కరెంటు స్తంభాలు, కేబుల్ వైర్లు ఉండడంతో కొంతమంది దీనిపై చర్చించుకోవడం జరిగిందన్నారు, అయితే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఈ పనులపై ఆరా తీయడం జరిగిందన్నారు, పైపులైన్ కి ఏదైనా ఇబ్బంది కలిగిన, పైపులైన్ పగిలిన, వెంటనే అక్కడే త్రాగునీటి పైపులైన్ మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు, అందరూ వైఎస్ఆర్సిపి నాయకులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఏ సమస్య వచ్చినా, మండల అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్నా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ సందర్భంగా వారు తెలియజేశారు, డ్రైనేజీ, రోడ్ల పనులకు ఎవరు వ్యతిరేకం కాదని, డ్రైనేజీ, రోడ్డు పనులు సజావుగా కొనసాగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులకు అడ్డంకులు రావని వారు తెలియజేశారు, చెన్నూరు టౌన్ లో ఇప్పుడు ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులను ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గుర్తించి ఆయా పనులకు మరిన్ని నిధులు కేటాయించడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని, దీనిని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు,  దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఇప్పటికైనా అలాంటి ఆరోపణలు మానుకోవాలని అలాంటి వారికి వారు హితవు పలికారు, అభివృద్ధి చేసేటప్పుడు మంచి సలహాలు ఇవ్వలే కానీ, అసత్య ఆరోపణలు చేయరాదని వారన్నారు, ఈ కార్యక్రమంలో, సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య, వైయస్సార్ సిపి నాయకులు, నాగ భూషణం, శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author