మహిళల అభ్యున్నతికి టిడిపి కృషి…
1 min read
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మంత్రాలయం న్యూస్ నేడు : మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేశారన్నారని టిడిపి నాయకులు రఘునాథ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి లు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆదేశాలతో టిడిపి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగింటి ఆడపడుచులకు మాతృసమానులైన మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి శాలువా పూల మాలతో సత్కారించడం జరిగిందన్నారు. 2025-26 వార్షిక బడ్జెట్లో మహిళ శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా మన కూటమి ప్రభుత్వం రూ 4,332 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మహిళ దినోత్సవం జరుపుకోవటం అనవాయితీ కాదు ఇది సమాజ బాధ్యత అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందని తెలిపారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య,ఉద్యోగాల్లో, రాజకీయాలో, రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించడం జరిగిందన్నారు. అలాగే దీపం పథకం 2 స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పించన్లు అంగన్వాడీ సెంటర్లు బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పని చేస్తున్నామని తెలిపారు. మహిళాభివృద్ధతోనే సమాజాభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నామని తెలిపారు. మీ భద్రత గౌరవం సాధికారత కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు మండలం టిడిపి అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, రచ్చమరి పోలీ శివ, పోలీ వీరేష్, మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.