NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 టిడిపి గెలుపు చారిత్రక అవసరం               

1 min read

పల్లెవెలుగు  వెబ్ పత్తికొండ: టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాం కుమార్    వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని పత్తికొండ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కేఈ శ్యాం కుమార్ స్పష్టం చేశారు. టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం, లక్ష్మిపల్లి గ్రామాలలో  బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం కుమార్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేకపోతే రాష్ట్రంలో జగన్ పాలన ప్రజా కంటకంగా మారుతుందన్నారు. జగన్ విధానాల వలన రాష్ట్రం పూర్తిగా అప్పులలో కూరుకు పోయిందని తెలిపారు. జగన్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత ప్రజలపై ఉందని గుర్తు చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే అంశంపై టిడిపి శ్రేణులు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టిడిపి తీసుకొచ్చిన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ , సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు తెలిపారు. అలాగే  బాబుతో భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి కుటుంబానికి ఏ ఏ పథకాలు వస్తాయో ఇంటింటికి తిరుగుతూ. ప్రజలకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్  ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువత నైపుణ్యం పొంది ఉద్యోగాలు చేస్తున్నారని వారు తెలిపారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక ఉన్న సమస్యలను పరిష్కరించలేక, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు ప్రజలు త్వరలోనే ఓటు ద్వారా తగిన గుణపాఠం  చెబుతారన్నారు.

About Author