NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికలపై ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన

1 min read

 -ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటున్న తల్లిదండ్రులు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: బాలికలకు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బాలికల పట్ల ఆసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్న సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామం ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది.ఈ పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఈ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు మదీనా నూరుల్లా(55) పనిచేస్తున్నారు.పాఠశాలలో పై తరగతులు చదువుతున్న బాలికల పట్ల టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని బాలికలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి గొడవ పడుతూ నువ్వు ఇక్కడ ఉండకూడదు బదిలీపై వెళ్లాలంటూ మహిళలు మందలించారు.గత నెల 15వ తేదీ నుంచి ఈనెల 15వ తేదీ వరకు మెడికల్ లీవ్ లో వెళ్లినట్లు తెలిసింది.అంతేకాదు దసరా సెలవుల్లో మరియు గత వారం కిందట టీచర్ గ్రామానికి వచ్చి సంఘ పెద్దలతోనూ మాట్లాడినట్లు ఈయన పాఠశాలకు రావడానికి మహిళలు ఒప్పుకోలేదని గ్రామస్తులు తెలిపారు.ఈయన మా పాఠశాలకు వద్దే వద్దని అంతేకాకుండా జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ విషయంపై ఎంఈఓ రామిరెడ్డిని వివరణ కోరగా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేను నివేదికను డిఈఓ కు పంపడం జరిగిందని ఆయన అన్నారు.

About Author