పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు అందించిన ఉపాధ్యాయుడు
1 min read
ప్యాపిలీ, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని వెంగలాంపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సునంద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోమెట్టుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం వెంగలాంపల్లి ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షలలో ఉపయోగపడేలా వారికి అవసరమైన ఎగ్జామ్ కిట్టును పంపిణీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి ఒక అట్ట,ఒక జామెట్రీ బాక్స్, ఒక లాంగ్ స్కేల్, రెండు పెన్నులు, పెన్సిల్,ఎరేజర్, షార్ప్ నర్ మరియు హాల్ టికెట్ కవర్ లను అందజేశారు.రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.ప్రతి సంవత్సరం తల్లి పేరు మీద ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డిని వెంగలాంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.అనంతరం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో ఉపయోగపడే మెళకువలు,సూచనలు,జాగ్రత్తలు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి బీసీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ నాయక్, వెంగళంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునంద, ఉపాధ్యాయ బృందం పవిత్రన్ రావు, పురుషోత్తం, సామ్రాజ్యలక్ష్మి, అబ్దుల్ సలాం, జయలత, ఖలీల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
