NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఏసీ నుంచి బయటికి వచ్చిన ఉపాధ్యాయ సంఘం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ఎన్జీవో జేఏసీ నుంచి ఏపీటీఎఫ్ బయటకు వచ్చింది. జేఏసీలోని పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజీనామా చేశారు. ఆ లేఖను జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావుకు పంపారు. తమ డిమాండ్ల పరిష్కారంలో జేఏసీ విఫలమైందని ఏపీటీఎఫ్ నేతలు పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ కూడా పరిష్కరించలేక పోయారని మండిపడ్డారు. ఛలో విజయవాడకు వచ్చిన ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించారని, పీఆర్సీలో టీచర్లకు అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు.

          

About Author