ఫేస్ రికగ్నిజేషన్ యాప్ కు టీచర్లు ఒప్పుకున్నారు : బొత్స
1 min readపల్లెవెలుగువెబ్ : విద్యావ్యవస్థలో మార్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు విషయాలు వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ సంఘాలతో రెండు అంశాలపై చర్చించాము. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌లో లోపాలు సరిదిద్దాము. ఈ యాప్ అమలు కోసం 15రోజుల గడువు కోరాము. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాము. ఫేస్ రికగ్నెజేషన్ యాప్ అమలుకు టీచర్లు అంగీకారం తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో మార్పులు తెచ్చాము. మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తున్నాము. 248 పోస్టులను సీనియారిటీపరంగా భర్తీ చేశాము. 38 డిప్యూటీ డీఈవో పోస్టులను కొత్తగా ఇస్తున్నాము. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని స్పష్టం చేశారు.