ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..
1 min read– ఉత్తమ ఉపాధ్యాయునిగా నెర్సు విజయరామరాజు కి అవార్డు..
– దేశానికి బాధ్యత గల పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే..
– ఎంపీపీ పెన్మత్స శ్రీనివాసరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు రురల్ మండలం పైడి చింతపాడు గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును అందుకోవడం ఆనందదాయకంగా ఉందని పైడి చింతపాడు ఎంపీ యూపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయలు నేర్సు విజయ రామరాజు అన్నారు. స్థానిక ఏలూరు మండల కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరం లో మంగళవారం జరిగిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన సత్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశానికి కావలసిన బాధ్యత గల పౌరులు రాష్ట్రపతులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులేనని. దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని. వారిని తీర్చిదిద్దేది విద్యార్థి దశ నుంచి ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యతని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మండలం, పైడి చింతపాడు ఎంపీ యూపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న నేర్సు విజయ రామరాజు కు ఉత్తమ ఉపాధ్యా యూనిగా అవార్డును మండల విద్యాశాకాధికారి రంగయ్య , మండలం పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ రాజు, లతోపాటు పలువురు మండల అధికారులు చేతుల మీదుగా అందచేశారు. ఈసందర్భంగా అవార్డును అందుకున్న విజయ రామరాజు మాట్లాడుతూ ఈ అవార్డును అందజేసిన మండల విద్యాశాకాధికారి రంగయ్య , మండలం పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ రాజు చేతులమీదుగా అవార్డు అందుకోవటం సంతోషంగా వుందన్నారు. నాతోటి ఉపాధ్యాయులు తోడ్పాటుతో పటు విద్యార్థి నీ విద్యార్థులు వారి తలిదండ్రుల కృషి కూడా ఉందన్నారు. ఈ అవార్డును అందుకోవడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.