PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వజ్రోత్సవ వేడుకలకు ఉపాధ్యాయులు సిద్దం కండి

1 min read

– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులు వజ్రోత్సవ వేడుకలకు సిద్ధం కావాలని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ హెచ్. తిమ్మన్న లు పిలుపునిచ్చారు. ఈ మేరకు తేదీ 16-07-2023 న కర్నూల్ నగరం నందలి సలాం ఖాన్ ఎస్ టి యు భవనంలో రాయలసీమ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ .తిమ్మన్న, రాష్ట్ర సహాధ్యక్షులు గంటా మోహన్,(చిత్తూరు)చంద్రశేఖర్,(నంద్యాల) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు సి నాగరాజు,(కర్నూలు) చంద్రశేఖర్,(అనంతపురం) రాష్ట్ర కార్యదర్శులు బి. ప్రసన్నరాజు (కర్నూలు) మహమ్మద్ ఇక్బాల్ బాషా (నంద్యాల) ఇ.వి.గోపాలకృష్ణ (నంద్యాల) రాయలసీమ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ గోకారి, టికే జనార్ధన్, అజాం బెగ్, డి చిన్న మౌలాలి, పి. రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య, జి .సూర్యుడు, రమణారెడ్డి, రామాంజనేయులు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 1946 జూన్ 9వ తేదీన ఆనాటి హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు ఆవిర్భవించి నేటి వరకు ఉద్యమాల ఊపిరిగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, అలాంటి సంఘంలో సభ్యులుగా ఉండడం మనకందరికీ గర్వకారణం అని తెలియజేశారు. ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా కర్నూలు నగరంలో జరపడానికి రాష్ట్ర సంఘం తీర్మానించిందని, ఆ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు అదేవిధంగా కడప అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి వజ్రోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ మేరకు వజ్రోత్సవాలకు సంబంధించి ప్రాథమిక సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో ఆహ్వాన సంఘం ఇక్కడి నుంచి ప్రకటించి వేడుకలను లాంచనంగా ప్రారంభిస్తామని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వజ్రోత్సవ వేడుకలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయని, కర్నూలు జిల్లాలో సంఘం బలంగా ఉందని నాయకత్వం క్యాడర్ బలంగా ఉన్నందువలన వజ్రోత్సవ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టాలని ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 117 పేరుతో 3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వదిలేసి ప్రైవేటు పాఠశాలల్లో చేరడం జరిగిందని ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కనుమరుగై గ్రామ గ్రామాన ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి పేద విద్యార్థులకు చదువు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు, అదేవిధంగా మునిసిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు ఆమోదించాలని, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు 010 హెడ్ జీతాలు పదోన్నతులు బదిలీలు కల్పించాలని, కస్తూర్బా ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఇద్దరు మండల విద్యాధికారుల మధ్య అధికార విధులు సమానంగా విభజించాలని, పెండింగ్ ఉన్నటువంటి 11వ పిఆర్సి బకాయిలు, కరువు బత్యం బకాయిలు, సంపాదిత సెలవు నగదీకరణ బిల్లుల చెల్లింపు, తక్షణం చెల్లించాలని అదేవిధంగా 12వ పిఆర్సి కమిషన్ తక్షణమే 50% మధ్యంతర భృతితో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా ఎస్టియు నాయకులు జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఈ. సుధాకర్ గౌడ్, మహమ్మద్ షఫీ, జి నాగరాజు, బి వెంకటేశ్వర్లు, శేఖర్, వెంకట్ రాముడు, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

About Author