ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన
1 min readఇంచార్జ్ ఎమ్మార్వో కి డిమాండ్లతో కూడినతే మాత్రం అందజేత
విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న 117 జీవో ను రద్దు చేయాలని డిమాండ్..
రాష్ట్ర అధ్యక్షులు బిఎ సాల్మన్ రాజు, జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రామారావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం ఏలూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30% అయ్యార్ వెంటనే ప్రకటించాలని, డిఏ బకాయిలు చెల్లించి పెండింగ్లో ఉన్న రెండు డిఏ లను ప్రకటించాలన్నరు. 2023 జూలై నుండి అమలు కావలసిన పన్నెండో పి అర్ సి ని వెంటనే ప్రకటించాలని విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో తిరిగి ప్రవేశపెట్టిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ మరియు ఏపీ జి ఎల్ ఐ లోన్లు మంజూరు చేయాలని కోరుతూ తదితర డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయులు సంఘటితంగా హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఈ పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బిఎ సాల్మన్ రాజు, జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు, జిల్లా కార్యదర్శి డి కె ఎస్ ఎస్ ప్రకాష్ రావు, ఏలూరు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు క్రమ ఆనంద్ కుమార్, అబ్బ దాసరి శ్రీనివాస్, ఏలూరు రూరల్ అధ్యక్షులు రామశేషు, ప్రధాన కార్యదర్శి తేళ్లూరి శ్రీనివాస్, పెదవేగి మండల అధ్యక్షులు మందలపు కృష్ణారావు, నిడమర్రు మండల ప్రధాన కార్యదర్శి ఎన్ కొండయ్య, రమాదేవి, సుహాసిని, సుజాత, అన్నపూర్ణ, జ్యోత్స్న, కేదారేశ్వర స్వామి, రత్నకుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ తోమ్మండ్రు ప్రకాష్, కోటేశ్వరరావు, బెనర్జీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రామారావు, అనంతరం ఇంచార్జ్ ఎమ్మార్వో కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు.