పత్తికొండలో.. ఉపాధ్యాయుల నిరసన
1 min readపల్లెవెలుగు వెబ్: ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులు పత్తికొండ మండలంలో నేడు “పెన్షన్ విద్రోహ దినం ” అంటూ నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జ్ లు ధరించి విధులకు హాజరైనారు. ఎందుకంటే 01.9.2004 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం CPS ను అమలుచేసినది. ఈ సందర్భంగా STU రాష్ట్ర నాయకులు కొత్తపల్లి సత్యనారాణ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన పాద యాత్ర లో అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు.కానీ 3 సంవత్సరాలు గడిచినా కమిటీలతో కాలయాపన చేసి చేతులు ఎత్తేశారు.ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగితే అక్రమ అరెస్టులు,అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురిచేయడం అన్యాయం అన్నారు.ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ కేసులు ఎత్తి వేయాలని,ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని,CPS రద్దు చేయాలని వివిధ పాటశాలలో,ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలోనిరసన తెలియచేస్తూ , నినాదాలు చేస్తూ డిమాండు చేశారు.