నిరుద్యోగులకు టెక్ మహీంద్రా ఆఫర్
1 min readపల్లెవెలుగువెబ్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కొత్త ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్రోగ్రాంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయని కంపెనీ అభిప్రాయపడింది. AWS రీ/స్టార్ట్ అనే ప్రోగ్రాం 39 దేశాలలో అందించబడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలతో అనుసంధానించనుంది. ఇది 12-వారాల జరిగే ప్రోగ్రాం. వ్యక్తిగతంగా, నైపుణ్యం-ఆధారిత శిక్షణను నిరుద్యోగులకు అందిస్తారు. దీనిలో ప్రాథమిక AWS క్లౌడ్ నైపుణ్యాలను, అలాగే ఇంటర్వ్యూ, రెస్యూమ్ రైటింగ్ వంటి ప్రాక్టికల్ కెరీర్ నైపుణ్యాలను కవర్ చేయనుంది. ఎంట్రీ-లెవల్ క్లౌడ్ పొజిషన్‌కు సిద్ధం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా హైదరాబాద్, మొహాలి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణేలలోని టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా అందుబాటులో ఉంటుంది.