బాధ్యతలు చేపట్టిన మిడుతూరు తహసిల్దార్
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల నూతన తహసిల్దార్ గా బుధవారం ఉదయం 10:30 కు ఏ.తులశమ్మ బాధ్యతలు చేపట్టారు.ఈనెల 5వ తేదీన జరిగిన అధికారుల సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న తహసిల్దార్ వెంకటేశ్వర్లును అధికారులు మిడుతూరు తహసిల్దార్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈయన మెడికల్ లీవ్ లో ఉన్నందున తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించకపోవడంతో నంద్యాల లోకల్ ఐజేషన్ స్పెషల్ తహసిల్దారుగా పని చేస్తున్న తులశమ్మను మిడుతూరు తహసిల్దారుగా జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు.ఈమె కూడా ఈనెల 5వ తేదీనే కడప జిల్లా రాజంపేట ఆర్డిఓ కార్యాలయంలో కోనేరు రంగారావు కమిటీ తహసిల్దారుగా పని చేస్తున్న ఈమెను నంద్యాలకు బదిలీ చేశారు మళ్లీ అక్కడ నుండి మిడుతూరుకు బదిలీ చేశారు.ఇక్కడ పనిచేస్తున్న తహసిల్దార్ ప్రకాష్ బాబు కడప జిల్లా చెన్నూరు తహసిల్దార్ గా బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే.