తెలంగాణ హైకోర్టుకు సీఎం జగన్ ?
1 min read
పల్లెవెలుగువెబ్ : తనపై నమోదయిన కేసు విషయంలో తెలంగాణ హైకోర్టును ఏపీ సీఎం జగన్ ఆశ్రయించారు. 2014లో హుజూర్‌నగర్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని జగన్ పిటిషన్ వేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించారని జగన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాలని జగన్‌కు ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో కోర్టును జగన్ ఆశ్రయించారు. జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.