రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి తెలంగాణ
1 min read
పల్లెవెలుగు వెబ్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. ఈ మేరకు ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్దంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు రాయలసీమ ప్రాజెక్టును సందర్శించాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులను ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఎన్జీటీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేసింది. పర్యటనకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపింది.