‘పంచ్ ప్రభాకర్ ’ పై తీసుకున్న చర్యలేంటో చెప్పండి ?
1 min readపల్లెవెలుగు వెబ్: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా విశాఖ సీబీఐ ఎస్పీ కోర్టు ముందు హాజరయ్యారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్ కు లేఖ రాశామని ఆయన చెప్పడంతో.. తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పంచ్ ప్రభాకర్ ను ఎవరో నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సందేహం వ్యక్తం చేసింది. ఆయన పై తీసుకున్న చర్యలేంటో.. దీని పై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.